చికిత్స అనంతరం ఆసరా మానవతావాదం

0
109
వైఎస్సార్‌ ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన బోస్‌
కాకినాడ,డిసెంబర్‌ 2 : ఆపరేషన్‌ అనంతరం కోలుకోవడం కీలక దశ అని, ఆ దశలో వారిని ఆదుకునేవిధంగా వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఆసరా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైయస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ఆసరా కార్యక్రమాన్ని  ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్‌ డి.మురళీర్‌ రెడ్డి, కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్యంతోపాటు శస్త్ర చికిత్సలు సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఆపరేషన్‌ అయిన తరువాత ఆ రోగి పూర్తిస్థాయిలో నయం కావాలంటే అతనికి పౌష్టికాహారం, విశ్రాంతి అవసరమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముందుస్తు ఆలోచనతో ఆపరేషన్‌ చేయించుకున్న రోగికి అతను కోలుకునే విధంగా రోజుకు 225 రూపాయలు చొప్పున నెలకు ఐదు వేల రూపాయలకు మించకుండా రోగికి ఆర్ధిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇంకా 34 శాతం నిరక్షరాస్యులతో పాటు ఆర్ధిక పరమైన ఇబ్బందులున్న కుటుంబాలున్నాయన్నారు. ఈ అసరా కార్యక్రమం ద్వారా వారికి మేలు కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టారని, ఆయన చేపట్టిన పధకం అనేక రాష్ట్రాలకు మార్గదర్శకమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మన్‌ భారత్‌ కార్యక్రమాన్ని ఈ స్ఫూర్తితో ప్రారంభించిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటకనుగుణంగా ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు శస్త్ర చికిత్స అనంతరం ఆర్ధిక సహాయం అందించడం గుప్ప విశేషమని అన్నారు. ముఖ్యమంత్రి శస్త్ర చికిత్స అనంతరం కోలుకుకనే సమయంలో పేద వాడికి 836 వ్యాధులకు సంబంధించి నిపుణులు నిర్ధారించిన మొత్తాన్ని అందించడం జరుగుతుందన్నారు. శస్త్ర చికిత్స చేయించుకున్న రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లోనే ఈ ఆసరా కార్యక్రమం అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ డి. మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్‌ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు నగరాల్లో 500 ఆసుపత్రులను గుర్తించి రోగులకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్సలు పొందడానికి చర్యలు చేపట్టిందన్నారు. అదే విధంగా కట్న వ్యాధులు వంటి తొమ్మిది రకాల వ్యాధుల వారికి పింఛన్‌ పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్ర శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ ఆసరా కార్యక్రమం ప్రవేసపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి మానవతా ద క్పదంతో కాకినాడకు చెందిన ఆరు సంవత్సరాల బాలికకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు 25 లక్షలు రూపాయలు, నాలుగు సంవత్సరాల బాలుడుకు కాలేయ మార్పిడికి 18 లక్షలు విడుదల చేయడం ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనమని చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ యం. రాఘవేంద్రరావు, డియంహెచ్‌ఓ డా. బి.సత్యసుశీల, ఆర్‌.యం.సి. ప్రిన్సిపల్‌ డా. బాబ్ది, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్‌ డా. మణిరత్న కిషోర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చికిత్స అనంతరం భ తిని పలువురు రోగులకు చెక్కులు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here