చిరకాల వాంఛను నెరవేర్చండి

0
250

ఎస్సీ జాబితలో చేర్చాలంటూ రజకుల ఆందోళన

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19 : రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌చేస్తూ రాజమండ్రి రజక సేవాసంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఈరోజు సబ్‌కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత కోటిపల్లి బస్టాండ్‌ నుండి ప్రదర్శనగా బయలుదేరిన రజక సంఘం సభ్యులు శ్యామలాసెంటర్‌ , మెయిన్‌రోడ్‌, కోటగుమ్మం సెంటర్‌, పుష్కర్‌ఘాట్‌, ఎన్జీఓ హోమ్‌, సుబ్రహ్మణ్యమైదానం మీదుగా సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన సభ్యులంతా తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శీలం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని ప్రకటించారని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల్లోను, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోను రజకులు ఎస్టీ,ఎస్సీలు గుర్తింపు కలిగి ఉన్నారని తెలిపారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో తమను ఎస్సీ జాబితాలో చేర్చుతామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై తీర్మానం చేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు వినతిపత్రాన్ని సబ్‌ కలెక్టర్‌కు అందచేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఇల్లూరి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు పాలమూరి వెంకటరావు, గౌరవ సలహాదారు చించినాడ నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి బొమ్మదేవర శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తురంగి వెంకట రమణ, బుడంపర్తి నాగేశ్వరరావు, కోశాధికారులు పచ్చిపాల సూర్యనారాయణ, కాకపర్తి నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి ఉల్లూరి మహేష్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here