చిరువ్యాపారాలకు అండగా జగన్‌

0
208
త్వరలో రుణాల పంపణీకి ప్రణాళిక
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : నగరంలో తోపుడుబళ్లపై, రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు అడపా రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తోపుడుబళ్ల వర్తకులు, వీధి వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తోపుడుబళ్లపై చిరువ్యాపారాలు సాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తోపుడు బళ్లు వర్తకులంతా ఐక్యంగా సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు, రుణాలను అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒక సొసైటీగా ఏర్పడి కొంత నిధిని సొసైటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నట్లు అయితే ఆ నిధినే తమ తమ వ్యాపారాలకు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అలాగే ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. నగరంలో ఎంత మంది ఇటువంటి చిరువ్యాపారాలు సాగిస్తున్నారనే అంశాన్ని గుర్తించడంతోపాటు, వారికి అవసరమైన గుర్తింపు కార్డులను త్వరలోనే ప్రభుత్వం ద్వారా అందిస్తారని వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకటరమణ(గెడ్డం రమణ) అన్నారు. ఈ కార్యక్రమంలో కొళ్లిమళ్ల రఘు, కాళే చిన్ని, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here