చేనేత కులాల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

0
167
రాజకీయ పార్టీలు సీట్లు కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 16 : రానున్న ఎన్నికల్లో చేనేత వర్గీయులకు పది ఎమ్మెల్యే, ఐదు ఎంపీ సీట్లను కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లతో చేనేత కులాల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వీవర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ డిమాండ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని, స్వయం ప్రతిపత్తి గల చేనేత మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు. కుటీర పరిశ్రమగా ఉన్న చేనేత రంగాన్ని పూర్తిస్థాయి పరిశ్రమగా గుర్తించి కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు. పంచాయితీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లలో చేనేత సహకార సంఘాల నాయకులకు, ఆప్కో డైరెక్టర్‌లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో పది ఎకరాలను కేటాయించి చేనేత భవనం నిర్మించాలని, దీంతోపాటు అన్ని జిల్లాల్లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. పద్మశాలీలకు టిటిడి ధర్మకర్తల మండలిలో శాశ్వత స్థానం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 30న రాజమహేంద్రవరంలో జరుగుతున్న బీసీ జయహో కార్యక్రమంలో చేనేత కార్పొరేషన్‌ను సీఎం చంద్రబాబు ప్రకటించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు కె.కె.సంజీవరావు, తంగెళ్ళ పద్మావతి, పిచ్చుక అనిల్‌, నిల్లా ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here