చేసిందేమిటో చెప్పాకే రండి 

0
261
మోడీ రాక సందర్భంగా గన్ని అల్టిమేటమ్‌
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28 : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలమీద రాష్ట్రం నిలువునా ద్వేషం పెంచుకుని అన్నివిధాలా అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ సిగ్గులేకుండా మళ్లీ ఈ గడ్డమీదకు రావడాన్ని ప్రజలందరూ నిరసిస్తున్నారని గుడా చైర్మన్‌  గన్ని కృష్ణ  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలముందు భాజపా చేసిన వాగ్దానాలనుగానీ చట్టబధ్దంగా విభజనచట్టంలో ఏపీకి రావలసిన ప్రయోజనాలను గానీ తుంగలోకితొక్కి అరకొరగా చేసి అన్నీ చేసామని చెప్పుకోవడం ఈ సిగ్గుమాలిన ఆంధ్రద్రోహుల పార్టీ భాజపా రాష్ట్రనాయకులకే చెల్లిందన్నారు. విశాఖ రాక సందర్భంగా రైల్వేజోన్‌ ప్రకటన చేయడం కూడా మరో మోసపూరితమైన చర్యే అని, విశాఖ జోన్‌ను ఇచ్చినట్టు ఇచ్చి సింహభాగం ప్రయోజనాలు ఒడిసా రాష్టానికి కేటాయించడం మళ్లీ మరోసారి మనలను మోసం చేయడంగాక మరేమిటని ప్రశ్నించారు. అందుకనే హామీలన్నీ వెరవేర్చకుండా రాష్ట్రానికొస్తున్న నరేంద్రమోడీ రాకను అడ్డుకుని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి పోలవరం, రాజధాని నిర్మాణాలకు నిధుల మంజూరులో తీవ్ర వివక్ష చూపిన మోడీ వాటి సంగతి తేల్చాక ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. రైల్వే జోన్‌ కోసం గొప్పలు చెప్పుకుంటున్న భాజపా మద్దతు పలుకుతున్న వైకాపా నాయకులు దానిలో  ఉన్న అంశాలను, వాస్తవాలను  తెలుసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here