జగన్మాత….వందనం

0
420
వైభవోపేతంగా ప్రారంభమైన శరన్నవరాత్రలు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 1 : నగరంలో శరన్నవరాత్ర మ¬త్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. పలుచోట్ల దేవీ ఆలయాల వద్ద అమ్మవారిని నె లకొల్పి పూజలు నిర్వహిస్తున్నారు. దేవీచౌక్‌లో ఏటా ఘనంగా నిర్వహించే దేవీ నవరాత్రులు గత అర్ధరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రతిష్టించి పూజలు ఆరంభించారు. ఈ సందర్భంగా దేవీచౌక్‌ పరిసరాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. అలాగే ఆల్కట్‌తోట, కోటిపల్లి బస్టాండ్‌, గోదావరి గట్టు, ఏవీ అప్పారావు రోడ్డు, జెఎన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా దేవీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయదశమి వరకు  జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.