జగన్‌కి అవకాశమిస్తే అరాచకమే

0
253
అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబును గెలిపించండి
రాజమహేంద్రవరం, మార్చి 28 : ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌కి ఓటు వేస్తే రాష్ట్రంలో అరాచకం, అవినీతి పేట్రేగిపోతాయని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని గుడా చైర్మన్‌ గన్నికృష్ణ, రూరల్‌ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. రూరల్‌ నియోజకవర్గం ధవళేశ్వరంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి గన్ని కృష్ణ, గోరంట్ల కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కనిపిస్తుందని, అన్ని చోట్ల చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. గత ఎన్నికలలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపితో జతకడితే నాలుగేళ్ళు నమ్మించి మోసం చేశారని, అందుకే ఎన్‌.డి.ఎ.నుంచి బయటకు రావడం జరిగిందన్నారు. అప్పటి నుంచి నరేంద్ర మోడి పై చంద్రబాబు యుద్ధం చేస్తున్నారని అన్నారు.దీంతో మోడి కుట్రలకు దిగి కెసిఆర్‌, జగన్‌లతో నాటకాలు ఆడుతున్నారన్నారు. జగన్‌కి అవకాశమిస్తే పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు ఆగిపోతాయని, సంక్షేమం కుంటుపడిపోతుందన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును కెసిఆర్‌ అడ్డుకుని కోర్టుకు వెళ్ళారని చెప్పారు.రౌడీ రాజ్యం రాకుండా జగన్‌కి బుద్ది చెప్పాలని కోరారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని, ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, పుక్కళ్ళ సత్తిబాబు,శీలంశెట్టి శ్రీనివాస్‌, నక్కా చిట్టిబాబు, శ్రీనివాసరెడ్డి, పిన్నింటి ఏకబాబు, రొబ్బి విజయశేఖర్‌, ఆళ్ళ ఆనందరావు, యర్రమోతు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here