జగన్‌తోనే సంక్షేమ పాలన సాధ్యం

0
182
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలోకి నందం స్వామి
రాజమహేంద్రవరం, డిశంబర్‌ 01 : స్థానిక తుమ్మలావ 36వ డివిజన్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలోకి నందం స్వామి, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో వైకాపాలో చేరారు.  సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, పార్లమెంట్‌ కో-ఆర్డినేటర్‌ మార్గాని భరత్‌, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, జెఎసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు  సమక్షంలో పార్టీ కండువా వేసుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నందం స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆంధ్రరాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోచుకుతింటూ, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని, మనల్ని మన రాష్ట్రాన్ని కాపాడే ఒకేఒక్క నాయకుడు వై.ఎస్‌.జగన్‌ అనే నమ్మకంతో పార్టీలోచేరుతున్నట్లు వివరించారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ  ఒకప్పుడు ఈ తుమ్మలావలో చిన్నపాటి వర్షానికే ఇక్కడ ఇళ్ళన్నీ మునిగి పోయేవని, ఎవరైనా ఇక్కడ నివాసం ఉండాలంటే భయపడేవారని, కానీ దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్యాపురం స్టోరేజ్‌ ట్యాంక్‌ (చెరువు) తవ్వించి, నల్లా చానల్‌వద్ద అత్యాదునిక జనరేటర్స్‌ మోటార్స్‌ ఏర్పాటుచేసి, ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించారన్నారు. అనంతరం నందం స్వామి మిత్రబృందం, 200 మంది కార్యకర్తలు పార్టీ కండువావేసుకుని పార్టీలోచేరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈతకోట బాపనసుధారాణి, మజ్జి నూకరత్నం, కానుబోయిన సాగర్‌, గుంటముక్కల రాజు, గుంటముక్కల రత్నామణి, నరవ గోపాలకృష్ణ, మజ్జి అప్పారావు, పెంకే సురేష్‌, గూడాల ఆదిలక్ష్మి, ఉప్పాడ కోటరెడ్డి, లాయర్‌ ఆరీఫ్‌, సప్పా ఆదినారాయణ, సుంకర శ్రీను, బిల్డర్‌ చిన్నా, కట్టా సూర్యప్రకాశరావు, వంకాయల సత్తిబాబు, రొక్కం త్రినాథ్‌, కట్టా వెకంటేష్‌, సింగర్‌ వెంకటేశ్వరరావు, గూడాల ప్రసాద్‌, అందనాపల్లిసత్యనారాయణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here