జగన్‌పై దాడికి గన్ని ఖండన

0
340
సంఘటనపై లోతైన విచారణ జరపాలని వినతి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 25 : విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై  జరిగిన దాడిని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ తీవ్రంగా ఖండించారు.  రాజకీయాల్లో హింసకు, దాడులకు తావు లేదని, జరిగిన ఘటనపై లోతుగా విచారణ జరపాలని ఆయన కోరారు. జరిగిన సంఘటనపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయని, ఎందువల్ల జగన్‌పై ఈ దాడి జరిగిందో  తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. వైకాపా నాయకురాలు రోజా ప్రభుత్వ వైఫల్యమంటూ చేసిన వ్యాఖ్యలు  అనుమానాలను బలపరుస్తున్నాయని అన్నారు. విమానాశ్రయాల్లో విఐపీల రక్షణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు పర్యవేక్షిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదని, వైఫల్యం చెందితే అది మోడీ సర్కార్‌దేనని అన్నారు. ఇలాంటి సంఘటనలను ఆధారం చేసుకుని రాజకీయాలు చేసి బురద జల్లాలనుకోవడం నీతిమాలిన చర్య అని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here