జగన్‌ అధికారంలోకి వస్తే అసంఘటిత కార్మికులకు అండ

0
173
వైకాపా ఆధ్వర్యంలో మే డే వేడుకలు
రాజమహేంద్రవరం, మే 1 : స్థానిక జాంపేటలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. వైకాపా పతాకాన్ని సిటీ నియోజకవర్గ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆవిష్కరించి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మికుల సంక్షేమానికి కృషిచేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కూడా కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తామని హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్న జగన్‌ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, కనీస వేతనాల అమలుకు పనిచేస్తారన్నారు. వైసిపి ట్రేడ్‌యూనియన్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆటో కార్మికులందరికీ అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, వైకాపా ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు గెడ్డం రమణ, పార్టీ నాయకులు బొమ్మన రాజ్‌కుమార్‌, పొలసానపల్లి హనుమంతరావు, కార్పొరేటర్‌ పిల్లి నిర్మల, పార్టీ నాయకులు అడపా రాజు, కొల్లిమళ్ల రఘు, కుక్కా తాతబ్బాయి, గుడాల జాన్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here