జగన్‌ జన్మదినోత్సవం..యువత రక్తదానం

0
106
కిటకిటలాడిన సుబ్రహ్మణ్య మైదానం
జక్కంపూడి గణేష్‌ ఆధ్వర్యాన నిర్వహణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 21 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు  నగరంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌ పేరుతో ఆయన తనయుడు వైసిపి యువనేత జక్కంపూడి గణేష్‌ ఆధ్వర్యంలో స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో భారీఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత భారీగా తరలివచ్చి రక్తదానం చేసారు. ఈ కార్యక్రమాన్ని వైసిపి కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సిటీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వేదికపై ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, మాజీ మంత్రి జక్కపూడి రామ్మోహనరావు విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని పలు కళాశాలల నుంచి విద్యార్థిని, విద్యార్థులు తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకలం వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఆయన జన్మదినోత్సవాన్ని సేవా దినోత్సవంగా భావించి ఆపదలో ఉన్న వారికి రక్తమిచ్చి ఆదుకోవాలనే లక్ష్యంతో జక్కంపూడి గణేష్‌ ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసారని ప్రశంశించారు. వైసిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలతో ఎంతో మంది పేద కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. యువనాయకుడిగా గణేష్‌ ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించారని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తామున్నామంటూ వైసిపి నాయకులు, కార్యకర్తలు ముందుండి సహకరిస్తానడానికి ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికి ముఖ్యమంత్రి జగన్‌ పలు పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన మరిన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టి అన్ని కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జగన్‌ పాలనకు ప్రజలందరూ మద్ధతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ధృవీకరణ పత్రాలు, డైరీలు అందచేసి అభినందించారు. ఈ శిబిరం నిర్వహణకు సహకరించిన వారికి జక్కంపూడి గణేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జగన్‌ బాటలోనే తమ కుటుంబం నిరంతరం నడుస్తుందన్నారు. ధన్వంతరి, ప్రభుత్వాసుపత్రి, రెడ్‌ క్రాస్‌ వైద్యులు రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించేందుకు సహకరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసిపి నేతలు పొలసానపల్లి హనుమంతరావు, ఆకుల బాపిరాజు, అడపా వెంకట రమణ, నరవ గోపాలకృష్ణ, నండూరి రమణ, ఇసుకపల్లి శ్రీనివాస్‌, ఆకుల శ్యాంబాబు, పోలు కిరణ్‌రెడ్డి, దాసి వెంకట్రావు, కురుమెల్లి అనూరాధ, కురుమెల్లి స్వరూప్‌, కొల్లిమళ్ల రఘు, బొరుసు శ్రీనివాస్‌, డాక్టర్‌ వివి కృష్ణారావు, కోడి కోటా, అరుణ్‌ జెకె, కొత్తపేట రాజా, సప్పా ఆదినారాయణ, డాక్టర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. జైన్‌ సేవా సమితి ప్రతినిధి విక్రమ్‌జైన్‌ రక్తదాన శిబిరానికి సంధానకర్తగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here