జగన్‌ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారు

0
174
తెదేపాకు చరమ గీతం పాడేందుకు ప్రజల నిరీక్షణ : వైకాపా కార్పొరేటర్లు
రాజమహేంద్రవరం, జనవరి 9 : రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌, అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ జిల్లా కన్వీనర్‌ బొంత శ్రీహరి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ చరిత్రలోనే ఎవరూ నడవని విధంగా తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారన్నారు. దివంగత మాజీ  ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు 1,470, షర్మిలారెడ్డి 3,112 కిలో మీటర్లు నడిచారని, జగన్‌ చేసిన పాదయాత్ర రికార్డును ఎవరూ చెరపలేరని అన్నారు.  తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చాపురంలో జరగనున్న బహిరంగ సభను చూసేందుకు మన రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయారని వివరించారు. అధికారంలోకి వస్తే జగన్‌ అమలు చేస్తామంటున్న నవరత్నాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతులయ్యారని, అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆయన బాసటగా నిలుస్తున్నారన్నారు. రానున్నల్లో ఎన్నికలను ఎదుర్కునేందుకు తాము అన్ని విధాలా బలంగా ఉన్నామన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ జరిగే అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. కార్పొరేటర్‌ ఈతకోట బాపనసుధారాణి మాట్లాడుతూ నగరంలో అమృత పథకంలో చేపడుతున్న పనుల కారణంగా మ్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లను ఇష్టానుశారంగా తవ్వేసి అలాగే వదిలేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై దుమ్ము కారణంగా ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారని, ఆ పనులను త్వరగా ఒక కొలిక్కి తీసుకురావాలని సూచించారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూతకర్నం, నాయకులు పెంకే సురేష్‌, కురుమిల్లి సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here