జగన్‌ పాలనా విధానాలు చూసి వైకాపాలో చేరా

0
590
సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 9 : రాజమహేంద్రవరం సిటీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేేరారు. రాష్ట్రాభివృద్ధిలో భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాను వైఎస్‌ఆర్‌ సిపిలో చేరిన్నట్టు రాజమహేంద్రవరం సిటీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో అమరావతిలో విజయదశమి సందర్భంగా  ఆయన వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆకులతో పాటు ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌, జనసేన నాయకుడు దాసి వెంకట్రావు కూడా వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ జగన్‌ తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుందన్నారు. కౌలు రైతులకు కూడా రుణాలు, రైతు భరోసా ఇచ్చారన్నారు. వాహనమిత్ర పథకంలో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటించి ఆ తరువాత మర్చిపోతారని, కానీ జగన్‌ మాత్రం పాలనకు అదే గీటురాయిగా చేసుకున్నారన్నారు. మద్యనిషేధం విషయంలో గతంలో చాలా మంది హామీ ఇచ్చారని కానీ జగన్‌ మాత్రమే దాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ఆయన వెంట పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌, రాజమహేంద్రవరం రూరల్‌ వైసిపి కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, ఆయన తనయుడు ఆకుల విజయకుమార్‌ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here