జగన్‌ పాలన బిసిలకు స్వర్ణయుగం

0
122
సిఎం ఫ్లెక్సీకి వైకాపా పాలాభిషేకం
రాజమహేంద్రవరం, జులై 15 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలో  బిసిలకు స్వర్ణయుగం రావడం ఖాయమని వైసిపి సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. బిసిలకు బడ్జెట్‌తో 15 వేల కోట్లు కేటాయించడమే కాకుండా బిసిల్లో ఉన్న అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధి సాధించేలా చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో జగన్‌ బిసిలకు వరాలు కురిపించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వైసిపి అర్బన్‌ జిల్లా బిసి సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో స్థానిక ఎవి అప్పారావురోడ్‌లో ఉన్న మహాత్మా జ్యోతిభా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమానికి రౌతుతో పాటు బిసి జేఏసీ రాష్ట్ర చైర్మన్‌, వైసిపి నాయకులు మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు దంగేటి వీరబాబు తదితరులు హాజరయ్యారు. ఈ ఐదేళ్ల జగన్‌ పాలనలో బిసిలకు రాజ్యాధికారం ఖచ్చితంగా వచ్చితీరుతుందని ధీమా వ్యక్తం చేసారు. అసెంబ్లీ స్పీకర్‌గా వెనుకబడిన వర్గాలకు చెందిన తమ్మినేని సీతారామ్‌ను నియమించడంతో పాటు మంత్రివర్గంలో కూడా బిసి సామాజిక వర్గానికి పెద్దపీట వేసారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ జగన్‌ నేరవేర్చుతారన్న నమ్మకం బిసిల్లో వచ్చిందన్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో కూడా బిసిలకు అగ్రభాగం దక్కుతాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. బిసిలకు రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సీటు కేటాయించి మార్గాని భరత్‌రామ్‌ను ఎంపీగా, పార్లమెంటరీ చీఫ్‌విప్‌గా చేసిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బిసిలు, మైనార్టీలు జగన్మోహన్‌ రెడ్డికి అండగా ఉంటారన్నారు. బిసిలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా జగన్‌ ప్రత్యేక దృష్టిపెడతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, పార్టీ నాయకులు ఎండి ఆరిఫ్‌, మజ్జి నూకరత్నం, సంకిస భవానీ ప్రియ, లంక సరేష్‌, కాటం రజనీకాంత్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here