జగన్‌ వస్తేనే రాష్ట్రానికి మంచిరోజులు

0
307
చంద్రబాబు పాలన అవినీతి మయం
49 వ డివిజన్‌లో ప్రారంభమైన ‘రావాలి జగన్‌- కావాలి జగన్‌’
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 18 : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘రావాలి జగన్‌- కావాలి జగన్‌’ గడపగడపకు కార్యక్రమం ఈరోజు 49వ డివిజన్‌ సుబ్బారావు నగర్‌లో సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు నేతృత్వంలో డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మాసా రామ్‌జోగ్‌ అధ్యక్షతన ప్రారంభమైంది.  డివిజన్‌లోని పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  బూత్‌లవారీగా  గడపగడపకు బూత్‌ కన్వీనర్లు, ఏజెంట్లతో వెళ్ళి వారి వారి సమస్యలు తెలుసుకుని, రాబోయే రోజుల్లో వారికి పరిష్కారం తప్పక లభిస్తుందని హామీ ఇచ్చారు. నవరత్నాల పథకాలతో జగనన్న వస్తున్నాడని, ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో లక్షరూపాయలనుండి 5 లక్షల వరకు ఒక సంవత్సరానికి  నేరుగా లబ్ది చేకూరుతుందని రౌతు తెలిపారు. తెలుగుదేశం  ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా చంద్రబాబునాయుడు నీరు, మట్టి, ఇసుక, భూమి ఇలా అన్ని రంగాల్లో దోచుకుతిన్నారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలోకూడా ఆంధ్ర ప్రజలను మోసం చేశారన్నారు. దీనికి ప్రజలు ఓటుతో బుద్దిచెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం ఒక్క జగనన్నతోనే సాధ్యమని, ప్రజలు మార్పుకోసం చూస్తున్నారని, డివిజన్‌ పర్యటనల్లో ప్రజలు స్పష్టం చేస్తున్నారని రౌతు అన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, కార్పొరేటర్లు ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, బూత్‌ కన్వీనర్లు ఏనుగుపల్లి రాజు, మాసా రామజోగి, 20 మంది ఏజెంట్లు, నాయకులు మజ్జి అప్పారావు , పెంకే సురేష్‌, కానుబోయిన సాగర్‌, మార్తి నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, పెదిరెడ్ల శ్రీనివాస్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌ గుదే రఘు నరేష్‌, ఉప్పాడ కోటరెడ్డి, గుడాల ఆదిలక్ష్మి, ప్రసాద్‌, దుంగా లక్ష్మి, సయ్యద్‌ హసీనా, యువజన విభాగం మరుకుర్తి కుమార్‌ యాదవ్‌, మోహిద్దీన్‌ పిచ్చాయ్‌, కాటం రజనీకాంత్‌, డాక్టర్‌ రాజశేఖర్‌, మేడబోయిన సునీల్‌, టీచర్స్‌సెల్‌ రమేష్‌, తామడ సుశీల, నీలపాల తమ్మారావు, రొక్కం త్రినాథ్‌, వంకాయల సత్తిబాబు, కట్టా సూర్యప్రకాశరావు, బత్తిన అన్నవరం, బాషా, వీవర్స్‌ సెల్‌ కోడి కోట, నందకిషోర్‌, గారా చంటి, ఖాన్‌, గుడాల సింహాచలం, విజయ్‌, సుభాషిణి, డాక్టర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here