జగన్‌ వస్తే సమస్యలన్నీ తీరుతాయి 

0
390
18 వ డివిజన్‌లో ఆకుల వీర్రాజు ఆధ్వర్యాన రావాలి జగన్‌..కావాలి జగన్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 13 : ”రావాలి జగన్‌ – కావాలి జగన్‌” అనే నినాదంతో రాజమహేంద్రవరం రూరల్‌ వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు స్ధానిక 18 వ డివిజన్‌లో గడప గడపకు వెళ్లి జగన్మోహన్‌రెడ్డి  ప్రకటించిన నవరత్నాల పథకాల ప్రాధాన్యతను వివరించారు.  రేషన్‌ కార్డులు అర్హులకు లేవని, పారిశుధ్యం సక్రమంగా  లేదని, పెన్షన్లు సరిగా అందడం లేదని, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి పోవడం వలన ఇంటి అద్దె మోయలేని భారంగా మారిందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.  ఎన్ని సార్లు అధికారులకు,ప్రజా ప్రతినిధులు ద ష్టిలో పెట్టిన ఎవరు సరిగా స్పందించడం లేదు అని ఆరోపించారు.  ఆకుల వీర్రాజు మాట్లాడుతూ అధికార పార్టీ  ప్రజా ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు క షి చేయడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో జగన్‌ను గెలుపించుకుని సువర్ణ పాలనకు నాంది పలకాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర, అర్బన్‌ జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు నరవా గోపాల క ష్ణ, నాయకులు అంథోని మంజులా, గాడా తాతారావు, నెల్లి సర్వేశ్వరరావు, ఇమామ్‌ బాబ్జి, కొల్లి వరలక్ష్మి, పడమటి కామరాజు, దమ్ము ప్రసాద్‌, చెట్టి చిట్టిబాబు, డబింగ్‌ రమేష్‌, చీకురిమిల్లి చిన్న, రొంపచర్ల రమేష్‌, కరపురెడ్డి బాబ్జి, గింజల నాగేశ్వరరావు, రాయుడు రమాయమ్మ, తుంపలా వరలక్ష్మి, వాడ చిన్న, మండపాక సరళ, అలంపల్లి గోవింద్‌ నాయుడు, ధర్మవరపు శ్రీనివాస్‌, పిట్టా నరసింహరావు, రాయుడు పుల్లయ్య, బయ్యపునీడి నెహ్రు, దమ్ము శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here