జగన్‌ సత్తా తేలిపోయింది..

0
209
50 రోజుల్లోనే వైకాపా ప్రభుత్వం గ్రాఫ్‌ పడిపోయింది
హామీల అమలు నుంచి వెనక్కి వెళుతున్న ప్రభుత్వం
అసెంబ్లీలో అధికార పక్షం నిరంకుశ వైఖరి : గోరంట్ల
రాజమహేంద్రవరం, జులై 25 : ప్రభుత్వ తీరును ప్రశ్నించి.. నిలదీస్తున్నందుకే అసెంబ్లీలో మాట్లాడకుండా తమ గొంతు నొక్కి సస్పెండ్‌ చేశారని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ పక్షం ఉప నాయకుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి విమర్శించారు. స్థానిక గాంధీపురంలోని తన నివాసంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. 25 ఎంపీ  సీట్లిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక ¬దా తెస్తానన్న జగన్‌ ఇప్పుడు అదే కేంద్రం ముందు మోకరిల్లారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారిపోయాయని అనేక చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసిపి నాయకులు దాడులు చేస్తు తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 50 రోజుల్లోనే వైసిపి ప్రభుత్వం గ్రాఫ్‌ పడిపోయిందని ఎద్దేవా చేసారు. ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సిన అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యే పరుష పదజాలంతో దూషించడం దారుణమన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు రావడం లేదని, రుణాలిచ్చేందుక బ్యాంకులు వెనుకడుగు వేస్తున్నాయన్నారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కేలా ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని మాట్లాడనివ్వకుండా మైకులు కట్‌ చేస్తున్నారని, స్పీకర్‌ సిఎం చెప్పినట్టే వ్యవహరిచడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన పథకాల పేర్లను మార్చుకుంటూ వెళ్లడమే తప్ప వైసిపి ప్రభుత్వం చేసిందేదీ లేదన్నారు. 592 హామీలిచ్చి వారిని నేరవేర్చడానికి ప్రయత్నించకుండా రేపు.. ఎల్లుండి అంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. 45 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బిసి మహిళలకు పింఛన్‌ ఇస్తామని ప్రకటించిన జగన్‌ ఇప్పుడు అది నవరత్నాల్లో లేదని తప్పించుకుని పోతున్నారన్నారు. అసెంబ్లీలో సిఎం తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. మహిళలకు పావలా వడ్డీ, రైతులకు పంట రుణం విషయంలో కూడా ప్రభుత్వం దగా చేసిందన్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్‌ పిపిఎల విషయంలో విచారణల పేరుతో కమిటీలు వేసి అవినీతి, అక్రమాలు జరిగిపోయాయని అవాస్తవాలు ప్రచారం చేసే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందని, పనులన్నీ ఎక్కడిక్కడే పెండింగ్‌లో పడ్డాయన్నారు. గ్రామ వలంటీర్లకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు కూడా బోగస్సేనని అవన్నీ వైసిపి కార్యాలయాల ద్వారానే జరుగుతున్నాయన్నారు. 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ కావడం ఇదే తొలిసారని.. అక్కడ తమ గొంతు నొక్కినా ఇక్కడ ప్రజల్లోకి వెళ్లి జరుగుతున్నవన్నీ వెల్లడిస్తామన్నారు. వాగ్ధానాలు నీరుగారిపోతున్నాయని, వేల కోట్లతో హామీలు ఇచ్చి  బడ్జెట్‌లో వందల కోట్లు కేటాయిస్తే ఏం ప్రయోజనం ఉంటుందని నిలదీసారు. ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నారని, నిరుద్యోగ భృతి ఎత్తేసి నిరుద్యోగులను ముంచేసారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 71 శాతం తమ ప్రభుత్వ హాయంలో చేయడం రికార్డన్నారు. బీజేపీ నేత రాంమాధవ్‌ వ్యాఖ్యలపై గోరంట్ల మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పాలన బాగా చేసిందని సర్టిఫికెట్లు ఇచ్చి ధృవీకరిస్తే ఆయన అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, పార్టీ నాయకులు నక్కా చిట్టిబాబు, కురగంటి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here