జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

0
415
 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఉపప్రధానికి ఘన నివాళులు
రాజమహేంద్రవరం, జూలై 06  : దళితవర్గాల భావితరాలకు బంగారు బాటలువేసిన మహనీయుడు, మాజీ ఉపప్రధాని బాబూజగ్జీవన్‌రామ్‌ వర్థంతి  నగర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగింది. నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కాటం రజనీకాంత్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కవురు శ్రీనివాస్‌ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. బాబుజగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నివర్గాలవారికి జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకంగా,వారి ఆశయ సాధనకు అందరూ కృషిచేయాలని రౌతు అన్నారు. కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ  బాబుజగ్జీవన్‌రామ్‌ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఎస్సీసెల్‌నాయకులు మాసా రామ్‌జోగ్‌, పతివాడ రమేష్‌, సీనియర్‌ నాయకులు నక్కా శ్రీనివాస్‌, సోము శ్రీను, అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్‌, మైనార్టీ నాయకులు  రబ్బానీ, గౌస్‌, ఖాన్‌, ముప్పన ప్రభాకర్‌, గుదేరఘునరేష్‌,  మేడబోయిన సునీల్‌, యువజన విభాగం అధ్యక్షులు మరుకుర్తి కుమార్‌ యాదవ్‌, వాకచర్ల  కృష్ణ, సయ్యద్‌ హసీనా, సంకిస  రవి, రొక్కం త్రినాథ్‌, పెదిరెడ్ల శ్రీనివాస్‌, మోద్దీన్‌పిచ్చాయ్‌, అందనాపల్లి సత్యనారాయణ, కుక్క తాతబ్బాయి, నీలం గణపతి, చాపల నాగేశ్వరరావు, మర్రి పుష్పరాజ్‌, సేవాదళ్‌ అధ్యక్షులు ఉప్పాడ కోటరెడ్డి, గుడాల ఆదిలక్ష్మి, ప్రసాద్‌, రేగుళ్ళ నాని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here