జనం మెచ్చిన నాయకుడు చంద్రబాబు 

0
235

 

25 వ డివిజన్‌లో తెదేపా నగర దర్శినిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 27 : ప్రజలు మెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 25 వ డివిజన్లో కార్పొరేటర్‌ కురగంటి ఈశ్వరి ఆధ్వర్యంలో నగర దర్శిని- నగర వికాసం కార్యక్రమం ఈరోజు జరిగింది. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు డివిజన్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్యకర్తలు తమదిగా భావించి ఆ సమస్య పరిష్కారానికి క షి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌  పంతం రజని శేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, తెదేపా నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కొరుమిల్లి విజయ్‌ శేఖర్‌, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాల్‌ రాయుడు, ది ఆర్యాపురం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకర్రావు, తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ కడలి రామక ష్ణ, 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ గగ్గర సూర్యనారాయణ, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, 25వ డివిజన్‌ తెదేపా ప్రెసిడెంట్‌ గుణపర్తి శివ, కార్యదర్శి చుక్కకుల వెంకటేశ్వరరావు, నల్లం ఆనంద్‌, కె.త్రినాధ్‌, 31వ డివిజన్‌ తెదేపా ఇంచార్జ్‌ తలారి భాస్కర్‌, గుత్తుల వెంకటనారాయణ,  సూరంపూడి శ్రీహరి, మొల్లి చిన్ని యాదవ్‌, పల్లి సాయి, మహబూబ్‌ ఖాన్‌, జాగు వెంకట రమణ, చౌదరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here