జనసేన కువైట్‌ విభాగం ఔదార్యం

0
295
క్యాన్సర్‌ సోకిన బాలుడి వైద్యానికి రూ.50 వేల సహాయం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 1 : జనసేన పార్టీ కువైట్‌ విభాగానికి చెందిన నాయకులు పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.  తుమ్మలావకు చెందిన బేతా వీరవెంకట అనిల్‌ అనే బాలుడికి క్యాన్సర్‌ సోకడంతో వైద్యం నిమిత్తం రూ.50వేల ఆర్దిక సహాయాన్ని అందచేశారు. స్దానిక ప్రెస్‌క్లబ్‌లో  జరిగిన కార్యక్రమంలో బాలుడి తల్లిదండ్రులకు జనసేన కువైట్‌ విభాగం తరపున కందా విజయ్‌కుమార్‌ అందచేశారు. ఈ సందర్బంగా జనసేన నాయకురాలు గంటా స్వరూపాదేవి మాట్లాడుతూ జనసేన కువైట్‌ విభాగం తరపున రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లోని వ్యాధులతో బాధపడుతున్నవారికి ఆర్ధిక సహాయాన్ని అందచేస్తున్నారని తెలిపారు. అభిమాన నాయకుడి పుట్టిన రోజు సందర్బంగా సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టే పార్టీ జనసేన మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబరు 2వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్బంగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆమె తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సేవావారోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జామి సత్యనారాయణ, దాసరి గురునాధ్‌, షేక్‌ బాషా, అత్తిలి రాజు, శ్రీనివాస్‌, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here