జనసేన పార్టీతోనే పాలన మార్పు

0
198
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 2 : జనసేన పార్టీతోనే పాలనలో మార్పు సాధ్యం అవుతుందని, జమసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ అధికారంలోకి వస్తేనే సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక 34వ డివిజన్‌ ఆర్యాపురం, రెల్లిపేటలో మంగళవారంనాడు జనసైనికులు, వామపక్షాలతో విస్త త ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో అనుశ్రీ సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వామపక్షాలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ గాజు గ్లాస్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే రాజమహేంద్రవరంలోని సమస్యలు తన శక్తీ వంచన లేకుండా అమలుచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రకాష్‌, ఎస్‌.శ్యామ్‌, గంటా స్వరూప రాణి, డాక్టర్‌ అనుసూరి పద్మలత, జి.శ్యామ్‌ సుందర్‌, పైడి రాజు, గెడ్డం నాగరాజు, విజయ్‌ కుమార్‌, సిపిఐ నాయకులు నల్లా  రామారావు, యడ్ల లక్ష్మి, నల్లా కుమారి, సేపేని రవణమ్మ, నాగమణి పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here