జన జీవనంలోకి చొచ్చుకెళ్ళేలా సహజ యోగా సెమినార్లు 

0
305
గోదావరి తీరాన అట్టహాసంగా ఆరంభమైన దక్షిణాది ప్రతినిధుల సదస్సు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 6 : పరమ పూజ్య మాతాజీ నిర్మలా దేవి నేషనల్‌ సహజ యోగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్ధానిక మన్యం గార్డెన్స్‌లో మూడు రోజుల పాటు జరిగే దక్షిణాది రాష్ట్రాల సెమినార్‌ కార్యక్రమం ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. ట్రస్ట్‌ నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ దినేష్‌ రాయ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 దేశాల్లో ఆచరిస్తున్న ఈ సహజ యోగాను మారుమూల ప్రాంతాల్లోని  ప్రజలకు సైతం అందించే విధంగా ప్రాంతీయ సెమినార్లను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల సెమినార్‌కు మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ సెమినార్‌ ద్వారా పాల అలవాట్లను విడిచిపెట్టి ధర్మ బుద్ధితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని సహజ ధర్మంలో ఏ చెడు విషయంతోను  రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. మాతాజీ  చెప్పిన ధర్మాలను పాటించడానికి సహజ యోగులు పరితపిస్తారని, సహజ ధర్మంలో బాగా ఎదగాలంటే గణేష్‌ పూజ, భక్తి అవసరమన్నారు. మూడు రోజుల పాటు జరిగే సెమినార్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతారని అన్నారు. నేషనల్‌ ట్రస్ట్‌ మాజీ సభ్యురాలు నాగేశ్వరి దేవి మాట్లాడుతూ సహజ యోగ ధ్యానం చాలా సరళమైన సాధారణ ప్రక్రియ అని, కుండలినీ శక్తిని జాగృతి చేసి దానిని పరమాత్మ రూపమైన పరమ చైతన్య శక్తితో అనుసంధానం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందన్నారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం  గణపతి హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సహజ యోగులు వేలాదిగా సెమినార్‌కు హాజరయ్యారు. వారందరికి భోజన, వసతి సౌకర్యాలను ట్రస్ట్‌ కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో నేషనల్‌ ట్రస్టీ మంతెన రమేష్‌, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ గోళ్ళ పద్మావతి, నేషనల్‌ ట్రస్టీ రాధారాజన్‌, కేరళ, తెలంగాణా, తమిళనాడు కో ఆర్డినేటర్లు విజయలక్ష్మీ, మల్లారెడ్డి, నీరజా నాగరాజన్‌, రాజమండ్రి కో ఆర్డినేటర్‌ రామారావు,ఏడుకొండలు, సుబ్బన్న, లయన్‌ కె వెంకటరెడ్డి, సురేష్‌బాబు, మధుసూదనరావు, హనుమంతరావు, బాబూరావు, ఎస్‌.పద్మావతి, తాతారావు తదితరులు పాల్గొన్నారు.
ఆనందమయ జీవితానికి సహజ యోగ ఉపయుక్తం
ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించడానికి సహజ యోగ ఉపయుక్తమని దినేష్‌రాయ్‌, నాగేశ్వరిదేవి అన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మనిషిలో ఉండే కామ,క్రోధాలు వంటి సప్త రుగ్మతలను నివారించేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయుక్తమవుతుందన్నారు. మాతాజీ నిర్మలా దేవి స్థాపించిన సహజ యోగ జ్ఞానం 120 దేశాల్లో అవలంభిస్తున్నారని, కొన్ని రాష్ట్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరెట్‌ సంస్ధల్లో సహజ యోగ జ్ఞానం చేస్తారని తెలిపారు. మానవ శరీరంలో, వెన్నెముకలో సూక్ష్మంగా మూడు నాడులు, ఏడు చక్రాలు ఉన్నాయని, ఈ అంతర్గత వ్యవస్థ మాన వ శరీరాన్ని నడిపిస్తుందన్నారు. సంతృప్తి, ప్రశాంత జీవనం సహజ యోగా జ్ఞానంతో సాధ్యమవుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here