జయహొ జవాన్‌

0
464
మాతృశ్రీ కళాశాల విద్యార్ధుల ర్యాలీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 1 : పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో ముష్కరులను మట్టుబెట్టిన భారత సైనికులకు మద్ధతుగా స్ధానిక సీతంపేటలోని మాతృశ్రీ జూనియర్‌ కళాశాల విద్యార్ధులు ఈరోజు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  పాకిస్ధాన్‌కు భారత్‌ సత్తా చూపిన సైనిక దళాలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ పురవీదుల్లో నిర్వహించిన ఈ ర్యాలీని సిసిసి ఎండి పంతం కొండలరావు ప్రారంభించారు. దేశ సైనికులకు మద్ధతు తెలిపే విధంగా కార్యక్రమాలు చేపట్టిన కళాశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ అరిగెల బాబూ నాగేంద్ర ప్రసాద్‌, డైరక్టర్‌ పృథ్వీ చరణ్‌, ప్రిన్సిపాల్‌ కె.పద్మ, బిక్కిన రవికిషోర్‌, సిఎఓ శ్యామలరావు, ఏఓ అబ్బులు, సిబ్బంది పాల్గొన్నారు.