జయహో బిసి విజయవంతానికై బైక్‌ ర్యాలీ

0
354
రాజమహేంద్రవరం, జనవరి 26 : తెలుగుదేశం పార్టీ రేపు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జయహో బిసి సదస్సుకు సన్నాహకంగా నగరంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున  బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల నుండి ప్రారంభించిన ఈ ర్యాలీ సిటిఆర్‌ఐ, క్వారీ సెంటర్‌, కోరుకొండ రోడ్‌, కంబాలచెరువు, దేవీచౌక్‌, అజాద్‌చౌక్‌, చర్చిపేట, సాయికృష్ణా ధియేటర్‌ రోడ్‌, డీలక్స్‌ సెంటర్‌, కోటిపల్లి బస్టాండ్‌, స్టేడియం రోడ్‌, బైపాస్‌రోడ్‌, నందం గనిరాజు జంక్షన్‌, వై-జంక్షన్‌ మీదుగా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని అర్బన్‌ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రారంభించగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. రేపు జరగనున్న జయహో బిసి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలిక శ్రీను, కడలి రామకృష్ణ, మరుకుర్తి రవియాదవ్‌, యిన్నమూరి దీపు, నక్కా దేవీవరప్రసాద్‌, బుడ్డిగ రాధ, బొచ్చా శ్రీను, హరి బెనర్జీ, మరుకుర్తి దుర్గా యాదవ్‌, కడితి జోగారావు, దాస్యం ప్రసాద్‌, చింతపల్లి నాని, పెనుగొండ రామకృష్ణ, తలారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here