జవ్వార్‌ ప్యానల్‌ జయహో 

0
467
చాంబర్‌ ఎన్నికల్లో ఘన విజయం
సత్యంబాబు ప్యానల్‌లో ఉపాధ్యక్షునిగా  ఒకే ఒక్కడు మండవిల్లి శివ ఎన్నిక
శివరామునికి తొలి గెలుపు – జక్కంపూడి కృషిపై అభినందనల వెల్లువ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 1: ప్రతిష్టాత్మకమైన ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలలో పూర్వాధ్యక్షులు బలపరచిన లక్ష్మీనారాయణ జవ్వార్‌ ప్యానల్‌ ఘన విజయం సాధించింది. దొండపాటి సత్యంబాబు ప్యానల్‌లో ఉపాధ్యక్షుడిగా పోటీ చేసిన మండవిల్లి శివ మాత్రమే గెలిచారు. మిగిలిన అన్ని స్థానాలను జవ్వార్‌ ప్యానల్‌ కైవసం చేసుకుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన చాంబర్‌ ఎన్నికలు జరిగాయి. అనంతరం గంట విరామం తరువాత కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల అధికారులు మారిశెట్టి రామారావు, గమిని రంగయ్య వ్యవహరించారు. వారికి సహాయకులుగా కురగంటి సతీష్‌, రొబ్బి విజయశేఖర్‌, కోడూరి శాంతారామ్‌, గ్రంధి పిచ్చయ్య ఉన్నారు. పూర్తిస్థాయిలో చాంబర్‌ ఫలితాలు ఈరోజు ఉదయం 8:30 గంటలకు వెలువడ్డాయి. అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ జవ్వార్‌ తన ప్రత్యర్ధి దొండపాటి సత్యంబాబు పై 145 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గౌరవ కార్యదర్శిగా మద్దుల మురళీకృష్ణ తన ప్రత్యర్థి గ్రంధి రామచంద్రరావు పై 498 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శిగా వెత్సా వెంకట సుబ్రహ్మణ్యం తన ప్రత్యర్ధి దేవత సూర్యనారాయణ మూర్తిపై 565 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. కోశాధికారిగా బలభద్ర వెంకటరాజు(రాజా) తన ప్రత్యర్ధి మజ్జి రాంబాబుపై 592 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా మండవిల్లి శివ 932 ఓట్లతో, వంటెద్దు సూరిబాబు 817 ఓట్లతో గెలుపొందారు. ట్రస్ట్‌ బోర్డు డైరెక్టర్లు మామిడి వెంకటరాజు 1121, కనకాల రాజా 902, పచ్చిగోళ్ళ సురేష్‌కుమార్‌ 871 ఓట్లతో గెలుపొందారు. డైరెక్టర్‌లుగా మద్దు సతీష్‌ 1049,చలువాది ప్రభాకరరావు 1042, వెత్సా వెంకటేశ్వరరావు 1031,బాలనాగు సుధీర్‌ 1027, వలవల దుర్గాప్రసాద్‌ (చిన్ని) 987,రాయుడు వెంకట స్వామి (బాబ్జి) 967,తోట లక్ష్మీనారాయణ (కన్నా) 949,సరాఫ్‌ బేరూలాల్‌ 932,అల్లంకి నాగేశ్వరరావు (బి10) 924, మామిడిపల్లి రామకృష్ణ 919, యక్కల వీరనాగేశ్వరరావు 869, కోటంశెట్టి సత్యనారాయణ (కెఎస్‌బాబు) 864,  పుచ్చల రామకృష్ణ 858,   పొట్లూరి రామ్మోహనరావు 835,  ఎం. మైథీన్‌ పిచ్చయ్య 749 ఓట్లను సాధించారు. దీంతో జవ్వార్‌ మద్దతుదారులు మెయిన్‌ రోడ్‌లో అర్ధరాత్రి బాణా సంచా కాల్చారు. జవ్వార్‌ బెల్ట్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ వ్యాపారవేత్త అశ్విన్‌ కుమార్‌ జవ్వార్‌ను పలువురు అభినందించారు. ఫలితాలు అర్ధరాత్రి అయ్యాక వెలువడినప్పటికి నిరీక్షించి  విజేతలను రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిటి కో ఆర్డినేటర్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, చాంబర్‌ పూర్వాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్‌,ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్‌,కొల్లేపల్లి శేషయ్య, పొలసానపల్లి హనుమంతరావు తదితరులు అభినందించారు. నగర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిటీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన జవ్వార్‌ ప్యానెల్‌ గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు వర్తకులతో నేరుగా మాట్లాడి మద్దతు కూడగట్టారు. కో-ఆర్డినేటర్‌ అయ్యాక తొలి విజయాన్ని సాధించడంతో ఆయన శిబిరంలో సంబరాలు జరుగుతున్నాయి. దీంతోపాటు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించారు.  జక్కంపూడి రాజాకు అశ్విన్‌ జవ్వార్‌ సన్నిహితులు కావడం, వారి పెదనాన్న జవ్వార్‌ అధ్యక్షునిగా పోటీ చేయడంతో ఎన్నికల వ్యూహానికి రాజా మరింత పదునుపెట్టారు.
ఒకే ఒక్కడు
చాంబర్‌ ఎన్నికల్లో దొండపాటి సత్యంబాబు ప్యానెల్‌లో ఉపాధ్యక్షుడుగా పోటీ చేసిన మండవిల్లి శివ మాత్రమే 932 ఓట్లు సాధించి ప్రత్యర్ధి ప్యానెల్‌లో ఒకే ఒక్కడుగా నిలిచారు. వర్తకులతో సత్సంబంధాలు కలిగిన మండవిల్లి శివ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం గొప్ప విశేషమేనని వర్తకులు చెబుతున్నారు. జవ్వార్‌ ప్యానెల్‌ జోరు గాలిలో మండవిల్లి శివ 932 ఓట్లు సాధించడం గొప్ప విషయమని అంటున్నారు. గతంలో కూడా మండవిల్లి శివ ఇదే తరహాలో విజయం సాధించి వర్తకుల మన్ననలు పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here