జాంపేట బ్యాంక్‌ ఎన్నికల్లో నామినేషన్ల కోలాహలం 

0
327
మళ్ళీ బరిలోకి దిగిన బొమ్మన రాజ్‌కుమార్‌ ప్యానెల్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 28 : జాంపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గ ఎన్నికలకు ఈరోజు నామినేషన్ల స్వీకరణ జరిగింది. వచ్చే నెల 6న జరగనున్న
ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు ప్రస్తుత చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ కాలెపు సత్యనారాయణ సారధ్యంలోని ప్యానెల్‌ నామినేషన్లను దాఖలు చేసింది.
ఎన్నికల అధికారి వి. త్రిమూర్తులుకు వారు తమ నామినేషన్లను అందజేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ ఒక్కరోజే గడువు ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంటకే 40కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సంఖ్య సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఎన్నికల్లో డైరక్టర్‌గా గోరక్షణపేట దేవాంగ సంక్షేమ సంఘం తరఫున సంఘం ఉపాధ్యక్షుడు, బ్యాంక్‌ మాజీ మేనేజర్‌ ఆశపు శేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని సిఐటియు నాయకులు బళ్ళా పూర్ణిమరాజు బలపర్చారు. ఈ కార్యక్రమంలో  సంఘం ఉపాధ్యక్షులు బళ్ళా శ్రీనివాస్‌, గౌరవ సలహాదారులు  పడాల వీరభద్రరావు, కొడమటి జగన్మోహనరావు, కార్యదర్శి నక్కిన దుర్గాప్రసాద్‌, కోశాధికారి బీరా కన్నయ్య, సహాయ కార్యదర్శి ముప్పన కుమారస్వామి, కార్యవర్గసభ్యులు యర్ర నాగేశ్వరరావు, కొండపల్లి మల్లికార్జునరావు, అల్లంకి సత్యనారాయణ, బాసిన చంద్రశేఖర్‌, బళ్ళా కాశీ అన్నపూర్ణ, ఆశపు అరుణ పాల్గొన్నారు.