జాతిపితకు, లాల్‌ బహుదూర్‌శాస్త్రికి  బిజెపి ఘన నివాళి

0
295
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 6 : రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా బిజెపి అధ్యక్షులు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రిల జయంతి ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పార్టీ కార్యాలయంలో లాల్‌ బహుదూర్‌శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగదేవి ధియేటర్‌ వద్ద వున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ ఇరువురు నేతలు భరతమాత ముద్దుబిడ్డలని, గాంధీజీ ఆచరించిన స్వచ్ఛభారత్‌, స్వదేశీ ప్రజలకు అలవాటు అయ్యేలా ప్రధాని మోదీ కృషిచేస్తున్నారన్నారు. అలాగే లాల్‌ బహుదూర్‌ శాస్త్రి యుద్ధ సమయంలో పిలుపునిచ్చిన జై జవాన్‌, జై కిసాన్‌ జాతి జనులకు ఎంతో స్ఫూర్తిదాయకమని, వారి పిలుపు మేరకు దేశ ప్రజలు ఆరోజుల్లో ఒక పూట భోజనం చేసి తమ బంగారాన్ని దేశానికి ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంతం కృష్ణ, అర్బన్‌ జిల్లా మీడియా ఇన్‌ఛార్జి దాస్యం ప్రసాద్‌, నగర ఉపాధ్యక్షులు సత్తి మూలారెడ్డి, పిల్లి వెంకటరమణ, పిల్లి మణెమ్మ, తంగిరాల శ్రీనివాస్‌, గీతా మహాలక్ష్మి, నందివాడ సత్యనారాయణ, వీరాంజనేయులు, అజయ్‌పాల్‌, బేతిరెడ్డి ఆదిత్య, చందు, కందికొండ రమేష్‌, తమ్మాజీ పాల్గొన్నారు.