జాతీయ హోదా ఉన్నా నిధుల విడుదలలో కేంద్రం తాత్సారం

0
206
 సీఎం చొరవతో పరుగులు పెడుతున్న పోలవరం : గన్ని కృష్ణ రాజమహేంద్రవరం, జనవరి 31 : బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను తిలకించేందుకు నగరం నుంచి ఈరోజు సుమారు 20 బస్సుల్లో ప్రజలు తరలివెళ్లారు. నగరంలోని 10, 14 డివిజన్లకు చెందిన ప్రజలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను తిలకించేందుకు వెళ్తున్న బస్సులకు గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో కేవలం రెండు శాతం మాత్రమే పనులు అయ్యాయని, గత నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ కృషి వల్ల 63 శాతం పనులు పూర్తియ్యాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ప్రజలను ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పంతం రజనీశేషసాయి, నగర టిడిపి అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు,  ఆర్యాపురం అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ చల్లా శంకర్రావు, టిడిపి యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, మరుకుర్తి రవియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here