జియోన్‌లో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

0
111
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 3 :  స్థానిక జియోన్‌ అంధుల పాఠశాలలో జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. జియోన్‌ నిర్వాహకులు ఎం.బెన్నుబాబు అధ్యక్షతన జరిగిన వేడుకలో ముఖ్య అతిధులుగా సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ గుత్తుల మురళీధర్‌, పతంజలి యోగ గురువు శ్రీనివాస్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ లీలాకృష్ణ హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ముందుగా సబ్‌ కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. అనంతరం అంధ విద్యార్థులు గీతాలాపన చేసి ఎంతగానో ఆకట్టుకున్నారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులతో కలిసి సబ్‌ కలెక్టర్‌ కేక్‌ కట్‌ చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సబ్‌ కలెక్టర్‌ను బెన్నిబాబు సత్కరించారు. ఈ సందర్భంగా జియోన్‌ సంస్థ విషయాలను వివరించారు. అక్కడున్న ప్రతిభావంతులైన విద్యార్ధులతో సబ్‌ కలెక్టర్‌ మాట్లాడి ఆ ప్రాంగణాన్ని సందర్శించారు. జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా చిన్నారులు వివిధ స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో అలరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here