జియోన్‌ అంధుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం

0
227
రాజమహేంద్రవరం, నవంబర్‌ 25 : కీ.శే. డా.ఎం.వి.రాఘవులు 83వ జయంతి, డా.ఎం.వి.రాఘవులు మెమోరియల్‌ అండ్‌ చారిటబుల్‌ వారి 3వ వార్షికోత్సవం సందర్భంగా జియోన్‌ అంధుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో డా.ఎం.వి.రాఘవులు చిత్రపటానికి పూలమాలతో అలంకరించి కుటుంబ సభ్యులు, డాక్టర్‌ అభిమానులు నివాళులర్పించారు. పలువురు వక్తలు డాక్టర్‌ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం మేనేజింగ్‌ ట్రస్ట్‌ ఎం.వి.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమం అనంతరం పాఠశాల విద్యార్ధులకు డా.ఏ.బి.బి.ఆర్‌.సుధీర్‌, డా.కె.సత్యం వైద్యసేవలు అందించి అనంతరం ఉచిత మందుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.కిరణ్‌ సూర్యదేవి, ఎన్‌.శ్రీనివాస్‌, గద్దె ప్రసాద్‌, మెడికల్‌ షాపు రాంబాబు, బల్లు తమ వంతు సేవలు అందించారు.ఈ శిబిరాన్ని అంబటి తాతారావు, చందన నాగేశ్వర్‌, ధార్వాడ రామకృష్ణ, పి.వి.రాంబాబు, ఎం.ఎన్‌.రావు, బేజు తదితరులు పాల్గొన్నారు.