జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మారిశెట్టికి సత్కారం రేపు

0
281
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 28 : జిల్లా గ్రంథాలయ సంస్ధ కార్యదర్శిగా నియమితులైన మారిశెట్టి సత్యనారాయణకు పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్ధాపకులు, సిసిసి చానల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ పంతం కొండలరావు ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సీతంపేట కృష్ణనగర్‌లోని మెడికల్‌ అసో షియేషన్‌ హాలులో అభినందన సభ నిర్వహించనున్నారు. సభాధ్యక్షులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్‌ బైర్రాజు  ప్రసాదరాజు, ప్రముఖ మానసిక తత్వవేత్త డా. కర్రి రామారెడ్డి, సీజిటిఎం కళాశాల కరస్పాండెంట్‌ ఎఎస్‌ఆర్‌ ప్రభు, గౌరవ అతిధిగా 38 వ డివిజన్‌ కార్పొరేటర్‌, నండూరి వెంకటరమణ, వక్తలుగా సాహితీవేత్త ఫణి నాగేశ్వరరావు, చిలకమర్తి పౌండేషన్‌ వ్యవస్థాపకులు పెరుమాళ్ళ రఘనాథ్‌, ఆదిత్య విద్యా సంస్ధల డైరక్టర్‌ ఎస్పీ గంగిరెడ్డి, భారత వికాస్‌ పరిషత్‌ పూర్వాధ్యక్షులు పివిఎస్‌ కృష్ణారావు, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు గట్టి రామారావు పాల్గొంటారు. ఆంధ్రకేసరి యువజన సమితి మాజీ అధ్యక్షులు అరిపిరాల నారాయణరావు సభ నిర్వాహకులుగా వ్యవహరిస్తారు.