జీఎస్‌టిపై వర్తకుల సందేహాలను నివృత్తి చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు

0
204
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 29 : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టి) విధానంపై వర్తకులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో నిన్న ఒక సమావేశాన్ని నిర్వహించారు. చాంబర్‌ అధ్యక్షులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షతన జరిగిన  ఈ సమావేశంలో జీఎస్‌టికి సంబంధించి   వచ్చే నెల 1 నుంచి 15 వరకు నమోదు చేయవలసిన రిజిస్ట్రేషన్ల గురించి వర్తకులకు గల సందేహాలను రాజమండ్రి టౌన్‌ సర్కిల్‌  సీటీఓ హెరాల్డ్‌, ఆల్కట్‌గార్డెన్‌ సర్కిల్‌ సీటీఓ శ్రీరామచంద్రమూర్తి, ఆర్యాపురం సర్కిల్‌ సీటీఓ  స్వర్ణలత పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా నివృత్తి చేశారు.  సదస్సు అనంతరం నగరంలో హోటల్స్‌, రెస్టారెంట్లను రాత్రి 11 వరకు తెరిచి ఉంచేలా అర్బన్‌ ఎస్పీ రాజకుమారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళి  అనుమతి ఇప్పించడంలో సహకరించిన చాంబర్‌ అధ్యక్ష, గౌరవ కార్యదర్శులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, కాలెపు రామచంద్రరావు, ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ కన్వీనర్‌ అశోక్‌కుమార్‌ జైన్‌, జిల్లా ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్‌లకు టౌన్‌ హోటల్స్‌ ప్రొప్రయిటర్స్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు కోసూరి సుబ్బరాజు, పుచ్చల రామకృష్ణ, సంకు బాబిలు పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అశోక్‌కుమార్‌ జైన్‌, నందెపు శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ మాటూరి రంగారావులతో పాటు చాంబర్‌ మాజీ అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్‌, చాంబర్‌ ఉపాధ్యక్షులు గ్రంధి వెంకటేశ్వరరావు, దొండపాటి  సత్యంబాబు, గౌరవ సంయుక్త కార్యదర్శి వెత్సా వెంకట సుబ్రహ్మణ్యం (బాబ్జీ), ట్రస్ట్‌బోర్డు కార్యదర్శి  కొత్త బాలమురళీకృష్ణ, మాజీ గౌరవ కార్యదర్శి  మద్దుల మురళీకృష్ణ, ట్రస్ట్‌బోర్డు డైరక్టర్‌ బత్తుల శ్రీరాములు, చాంబర్‌ ప్రతినిధులు పచ్చిగోళ్ళ వెంకట సూర్యనారాయణ, తోట లక్ష్మీనారాయణ (కన్న), పుచ్చల రామకృష్ణ, కుడుపూడి వెంకట ప్రసాద్‌, గ్రంధి గోపాలకృష్ణ, కోసూరి సుబ్బరాజు, యక్కల వీర నాగేశ్వరరావు, పైడేటి నారాయణరావు, గమిని రంగయ్య, తమ్మన సుబ్రహ్మణ్య గుప్త, నాళం సుబ్రహ్మణ్యేశ్వరరావు, తాడి  వాసుదేవరావు, నూనె రామకృష్ణ, గునిశెట్టి విజయ్‌కిరణ్‌, కులకూరి శ్రీనివాస వీర గొల్లంరాజు, యలమర్తి వెంకటేశ్వరరావు, భేరులాల్‌ జైన్‌, ఎస్‌.అనంతరామ్‌, మద్దుల శ్రీనివాస్‌, బత్తుల రాజబాబు,కంచర్ల ప్రసాద్‌, రమేష్‌కుమార్‌ జైన్‌ పాల్గొన్నారు.