జెసి బ్రదర్స్‌ నుంచి  రక్షణ కల్పించండి 

0
267
సీఎంకి ప్రబోధానంద స్వామి  భక్తుల విజ్ఞప్తి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 24 :  భగవద్గీత జ్ఞానాన్ని పదిమందికీ పంచిపెడుతూ జ్ఞాన బోధ చేస్తున్న అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని చిన్న పొడమల గ్రామంలోని ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై ఎంపీ జెసి దివాకర్‌ రెడ్డి సోదరులు తమ అనుచరులతో దాడికి తెగబడడమే కాకుండా భక్తుల ఇళ్లకు వెళ్లి కృష్ణుని విగ్రహాలు ధ్వంసం చేస్తూ, రచనలు చించేస్తున్నారని  బోధానంద స్వామి భక్తులు ఆవేదన చెందారు. జెసి సోదరుల ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి  వారు విజ్ఞప్తి చేసారు. ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం భక్తులు బి. శాంతరాజు, బి సత్యవతి,ఏ అనిల్‌ కుమార్‌,కె శోభారాణి,కె శేఖర్‌,బి జయంలతో కల్సి  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఆశ్రమంలో భగవద్గీత జ్ఞాన బోధ జరుగుతుందని,ప్రతి పౌర్ణమికి స్వామి వారి ప్రసంగం లైవ్‌లో ఉంటుందని,ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇంటర్‌ నెట్‌ లో వీక్షిస్తారని శాంతరాజు చెప్పారు. అయితే అక్కడ అసాంఘిక, అసభ్య కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ జెసి సోదరులు గత రెండేళ్లుగా ఆశ్రమాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మంచినీరు, కరెంట్‌,ఆఖరికి పారిశుధ్య సమస్య కూడా సృష్టించారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ శాంతంగానే సహించామని, అయితే ఈనెల 15న కావాలనే మారణాయుధాలతో జెసి సోదరులు తమ అనుచర గణంతో వచ్చి దాడులకు తెగబడ్డారని ఆయన ఆరోపించారు. 144సెక్షన్‌ ఉన్నా సరే జెసి బ్రదర్స్‌ ధర్నా చేసి, ఆశ్రమంపైకి దూసుకు రావడంతో గత్యంతరం లేక భక్తులు ప్రతిఘటించాల్సి వచ్చిందని, ఈ దాడుల్లో ఎందరో భక్తులు గాయాల పాలయ్యారని ఆయన చెప్పారు. కేవలం కప్పం కట్టడం లేదనే కక్షతో అధికారం అండచూసుకుని జెసి బ్రదర్స్‌ ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు, ఆశ్రమానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. సత్యవతి మాట్లాడుతూ మహిళలు ఇబ్బంది పడేలా ప్రకటనలు చేస్తూ, అక్కడ జరిగే కార్యక్రమాలను వక్రీకరించి చెబుతున్నారని దీంతో తమ కుటుంబాల్లో అలజడి రేగుతోందని ఆవేదన చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here