జోడుగుళ్ళలో విజయేంద్రసరస్వతి స్వామి పూజలు

0
254
రాజమహేంద్రవరం, నవంబర్‌ 28 : టి.నగర్‌ శ్రీబాల త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీవిశ్వేశ్వరస్వామి దేవస్థానము నకు కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి మహాస్వామి ఆలయము ధర్మ కర్తల మండలి చైర్మన్‌ మండవిల్లి శివ, సభ్యులు, కార్యనిర్వాహణాధికారి, ఆలయ ప్రధాన అర్చకులు ఆలయము మర్యాదలతో వేద పండితులతో మంగళవాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతము పలికారు. స్వామి వారిచే శ్రీ బిందుమధ్య స్వామి వారికి, వెంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణము చేశారు. ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మండవిల్లి శివ,  సభ్యులు  రాయి అప్పన్నబాబు,  పి. పద్మజ,  రాపర్తి శ్రీనివాస్‌,  కొల్లి నాగేశ్వరరావు,  కోలా అప్పారావు, మందపల్లి వెంకటరమణ, కార్యనిర్వాహణాధికారి ఎం. శోభారాణి,  ఆలయం మాజీ చైర్మన్‌ నిమ్మలపూడి గోవింద్‌, వార్డు కార్పొరేటర్‌ కొమ్మా శ్రీనివాసరావు, ప్రింటోనికా మురళీ,  విశ్వేశ్వరరావు, తవ్వారాజా,  కాళీ కృష్ణ,  రొబ్బి విజయశేఖర్‌, గుత్తుల మురళీ, విశ్వనాథ్‌, దవులూరి రామకృష్ణ, మద్దుల సరయ్య, వెత్సా మురళీ, శివ, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.