జోరందుకుంటున్న నామినేషన్లు 

0
209
పార్టీ కార్యాలయాలు, ఆర్‌.ఓ. కార్యాలయాల వద్ద కోలాహలం
ఎం.పి స్ధానానికి భరత్‌, రూరల్‌్‌కి గోరంట్ల, ఆకుల వీర్రాజు దాఖలు
రాాజమహేంద్రవరం, మార్చి 21 : సార్వత్రిక ఎన్నికలలో నామినేషన్ల  దాఖలుకు ఈ నెల 25 వ తేదీతో గడువు ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో నగరంలో పార్టీ కార్యాలయాల వద్ద, ప్రధాన రహదారులలో, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్‌, రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వైకాపా అభ్యర్ధి ఆకుల వీర్రాజులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. వైకాపా ఎంపి అభ్యర్థి భరత్‌ నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో భారీ ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటీవలే వైకాపలో చేరిన హాస్య నటుడు ఆలీ ఈ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గోరంట్ల  తన నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్ళి బొమ్మూరులోని రూరల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు.  గోరంట్లను గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.  వైకాపా అభ్యర్ధి ఆకుల వీర్రాజు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి  హుక్కుంపేటలోని వైకాపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్‌ దాఖలు చేశారు. నాయకులంతా నామినేషన్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here