జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత 

0
173
బెంగళూరు, జూన్‌ 10 : సామాజిక వేత్త, ప్రముఖ నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌  కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.  ఆయన వయస్సు 81 సంవత్సరాలు. పలు తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించడమే గాక పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. రచయితగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్‌ అవార్డు ఆయనకు వరించింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది. గిరీష్‌ కర్నాడ్‌ పూర్తి పేరు గిరీష్‌ రఘునాత్‌ కర్నాడ్‌. కర్నాడ్‌కు భార్య సరస్వతి, కుమారుడు రఘు, కుమార్తె రాధ ఉన్నారు. 1938లో మే 19న మహారాష్ట్రలోని మథేరన్‌ ప్రాంతంలో జన్మించారు. నలభై ఏళ్ల సినీ కెరీర్‌లో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నాలుగు ఫిలింఫేర్‌ అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగులో ‘ధర్మచక్రం’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘కొమరం పులి’ చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా కన్నడ, హిందీ సినిమాల్లో పలు ముఖ్య పాత్రలు పోషించారు. గిరీష్‌ చివరిగా నటించిన చిత్రం ‘అప్నా దేశ్‌’. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కాబోతోంది. భారతీయ కళలు, సంగీతం, సాహిత్యం, న త్యనాట్యాలు, జానపద సంస్క తి రూపాలతో పాటు ప్రాచుర్యంలో ఉన్న సాహిత్య ప్రక్రియలపై అనితర సాధ్యమైన అవగాహన ఉన్న మేధావి గిరీష్‌ కర్నాడ్‌. భారతీయ భాషలలో మాట్లాడగల, చదవగల బహుభాషా కోవిదుడాయన. కర్నాడ్‌ తన ఆత్మకథను కన్నడలో రాసుకున్నారు. పుట్టిన ప్రదేశం అభివ ద్ధి కోసం అంకిత భావంతో కృషి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here