జ్యోతిరావు ఫూలేకు కాంగ్రెస్‌ నేతల నివాళి

0
367

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 11 : మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నగర బీసీ సెల్‌ అధ్యక్షులు లోడ అప్పారావు సారధ్యంలో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు ఫూలే సేవలను స్మరించారు. ఆయన విగ్రహం ఎదుట ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దాసి వెంకట్రావు, బెజవాడ రంగా, అబ్దుల్లా షరీఫ్‌, కాటం రవి, షెహెన్‌షా, గోలి రవి, పిశిపాటి శ్రీనివాస్‌, కొవ్వూరి శ్రీనివాస్‌, పిల్లా సుబ్బారెడ్డి, నలబాటి శ్యామ్‌, కాటం రవి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here