టిటిడిలో క్రాఫ్ట్స్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అదనపు ఎస్పీ రమణకుమార్‌

0
108
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 5 : హస్త కళా వస్తువులను, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని అదనపు ఎస్పీ వై.వి.రమణకుమార్‌ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ హస్తకళాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో టిటిడి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లేపాక్షి క్రాఫ్ట్స్‌ టెక్స్‌టైల్స్‌-2019 హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాల ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆయన స్టాల్స్‌ పరిశీలించి హస్త కళాకారులను అభినందించారు. ఈ నెల 15 వరకు నగర ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ ను అందరూ తిలకించి వారిని ప్రోత్సహించాలని కోరారు. కళాకారులు తయారుచేసిన కళాకృతులను నేరుగా వినియోగదారులకు అందించేలా ఆంధ్రప్రదేశ్‌ హస్తకళాభివృద్ది సంస్థ ప్రోత్సహిస్తుందన్నారు. లేపాక్షి మేనేజర్‌ ఎస్‌.కె.సిరాజుద్దీన్‌ మాట్లాడుతూ సీతపల్లి, తిరుమలాయపాలెం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలలో తయారు చేసిన వస్తువులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్‌ ఉంటుందన్నారు.ఈ కార్యాలయంలో లేపాక్షి విశ్రాంత అధికారి కుమార్‌ రత్నం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here