ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంపై సమీక్ష

0
89
రాజమహేంద్రవరం, ఆగస్టు 13 :రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్‌ మెరుగుదలకు ప్రత్యేక చర్యలను చేపట్టాల్సివుందని కమిషనరు సుమిత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నందు ఆయన ట్రాఫిక్‌, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళికా విభాగం, సోలార్‌ సిగ్నల్‌ వ్యవస్థ తదితరులతో మంగళవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఉన్న సిగ్నల్‌ విధానం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్‌ జామ్‌ అవ్వటం, నీఘా కోసం ఏర్పాటు చేసిన కెమెరాల పనితీరు, పశువుల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నగరంలో ముఖ్యంగా పుష్కర్‌ ఘాట్‌, గోదావరి బండ్‌, కోటగుమ్మం ప్రదేశాలలో పార్కింగ్‌కు సంబంధించి నిబంధనలను ఖఠినతరం చేయాలని కమిషనర్‌ సూచించారు. సిగ్నల్‌ ప్రాంతంలో ప్రజలు రహదారి దాటేందుకు వీలుగా జీబ్రా లైన్స్‌ వేయాలన్నారు. కంబాల చెరువు, తాడితోట, కటారీనగర్‌, రామాలయం సెంటర్లలోని సిగ్నల్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కల్గడానికి గల కారణాలపై క్షుణ్ణంగా పరిశీలించి అంతరాయానికి కారణం అయ్యే షాపులు,  సంచార వ్యాపారస్తులను ఆయా ప్రాంతాల నుంచి తరలించే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. పెరిగిన జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా దానవాయి పేట ప్రాంతంలో వన వేను అమలుపరచటంపై పరిశీలన జరిపి, వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా అమలు పరచేందుకు తగు చర్యలను చేపట్టాలని ట్రాఫిక్‌ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి. శ్రీనివాస్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యలపై పలు విషయాలను కమిషనరు ద ష్టికి తీసుకువచ్చారు. విచ్చల విడిగా పశువులు సంచరించటం వలన ప్రజలు, వాహన దారులు పలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రధాన మార్గాలు, రహదారులపై డస్ట్‌ బిన్‌ ఉన్న కారణంగా ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పాటు ఉందన్నారు. నగరపాలక సంస్థ ట్రాఫిక్‌ విభాగం సమన్వయంతో ట్రాఫిక్‌ మెరుగుదలకు చర్యలను వేగవంతం చేయాలని సుమిత్‌ కుమార్‌ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమీక్షలో సూపరింటెండింటింగ్‌ ఇంజనీర్‌ ఓం ప్రకాష్‌, సిటీ ప్లానర్‌ వర ప్రసాద్‌, ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థకు సంబంధించి ఆస్ట్రానిక్స్‌ కంపెనీ ప్రతినిధి మహిప్‌, స్టాండ్‌ పవర్‌ కంపెనీ నుండి సత్తి బాబు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here