ట్రేడ్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం  

0
309
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 4 : ఆర్టీసి కాంప్లెక్స్‌ రోడ్డులోని మార్గాని ఎస్టేట్స్‌లో  ఇండియా ట్రేడ్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ను గత సాయంత్రం బిసి నాయకులు మార్గాని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడు వలీ మహమ్మద్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు వినోదం అందించాలన్న ఉద్ధేశ్యంతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశామని, అతిపెద్ద జయింట్‌ వీల్‌ను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. దాలియన్‌ రేంజర్‌, కప్పూ సాసర్‌, మేరీ గ్రౌండ్‌, బ్రేక్‌ డ్యాన్స్‌, ప్రెస్‌బీ వంటి వినోద పరికరాలతో పాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన వస్తువులను సమకూర్చామన్నారు. వివిధ రకాల వంటకాలతో ఫుడ్‌ స్టాల్స్‌తో పాటు ఫ్యాన్సీ, వస్త్రాల స్టాల్స్‌ కూడా ఉంటాయన్నారు. ప్రవేశ రుసుము రూ. 30 గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మార్గాని సురేష్‌, కడియాల లక్ష్మణరావు పాల్గొన్నారు.