డబుల్‌ డస్ట్‌ బిన్స్‌ను పక్కాగా వినియోగించండి : కమిషనర్‌ 

0
205
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 20 : నగరంలో వాణిజ్య ప్రదేశాలలో ఏర్పాటు చేసిన డబుల్‌ డస్ట్‌ బిన్స్‌ ను పక్కాగా వినియోగించాలని కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌ పిలుపు నిచ్చారు. కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌ గురువారం స్థానిక మెయిన్‌ రోడ్‌ నందు పర్యటిస్తున్న సందర్భంలో ప్రజారోగ్య సిబ్బంది ఏర్పాటు చేసిన డబుల్‌ డస్ట్‌ బీన్స్‌ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన డస్ట్‌ బిన్స్‌పై తడి పొడి చెత్తను విడిగా వేసే విధంగా స్టిక్కర్లను అంటించాలని సూచించారు. ఇంతవరకు గుర్తించిన ముఖ్యమైన ప్రదేశాలలో 50 డబుల్‌ బిన్స్‌ ఏర్పాటు చేశారని, వీటిలో వివిధ పనుల నిమిత్తం వాణిజ్య కొనుగోళ్ళ నిమిత్తం వచ్చే సందర్శకులు వారు ఉపయోగించిన వ్యర్ధాలు రహదారులపై విచ్చల విడిగా పడవేయకుండా జాగ్రత్తగా ఈ బిన్స్‌ నందు వేయాలని సూచించారు. వీటి వలన ప్రధాన రహదారులు శుభ్రంగా ఉంటాయని గుర్తుచేశారు. త్వరలో ఇంకా నగరంలో 186 బిన్స్‌ ఏర్పాటు  చేస్తామని చెప్పారు. జనవరి నెలలో స్వచ్‌ సర్వేక్షణ్‌ బ ందం నగరానికి పరిశీలన నిమిత్తం రానుందని, నగరం మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానికులు సహకరించాలని కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here