డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం

0
289

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17 : నగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు ఈరోజు శంకుస్థాపనలు చేశారు. స్ధానిక 39,7,5,9,2,44,48,42,47 డివిజన్లలో సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు కొబ్బరికాయలు కొట్టి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పితాని లక్ష్మీ కుటుంబరావు, తలారి ఉమాదేవి, కోసూరి చండీప్రియ, గరగ పార్వతి, మళ్ళ నాగలక్ష్మీ, రేలంగి శ్రీదేవి, బిజెపి నాయకులు అయ్యల గోపి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, నాళం పద్మశ్రీ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here