డివిజన్‌లో ప్రభుత్వ స్థలాలు పరిశీలించిన కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి    

0
127
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 12 : రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ప్రభుత్వ స్థలాలను గురువారం జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి పరిశీలించారు. కోరుకొండ మండలంలోని నిడిగట్ల గ్రామంలో 7 ఎకరాలు, గాడాల గ్రామంలో సుమారు రెండు ఎకరాలు, పరిశీలించారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో కోలమూరు గ్రామం వద్ద 24 ఎకరాలు, ధవళేశ్వరం వద్ద ఇరిగేషన్‌ భూమి సుమారు 82 ఎకరాలు, నగరంలో హుక్కుంపేట వద్ద 9 ఎకరాలు, క్వాయర్‌ బోర్డు ప్రాంతంలో 4 ఎకరాల స్టలలను పరిశీలించారు. ఇల్లు నిర్మాణానికి సంబంధించి భూములను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ రావిరాల మహేష్‌ కుమార్‌, అర్బన్‌ తహసీల్దార్‌ సుస్వాగతం, రూరల్‌ తహసీల్దార్‌ రియాద్‌ హుస్సన్‌, కోరుకొండ తహసీల్దార్‌ టి.రాజేశ్వరరావు తదితరులు వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here