ఢిల్లీ సదస్సు చర్చల్లో  మేయర్‌ రజనీ శేషసాయి

0
217
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 17 : స్థానిక సంస్థల్లో మెరుగైన అభివృద్ధి సాధించేందుకు బహుళ స్థాయిల్లో భాగస్వామ్యాలను పటిష్టపరచడం, పౌర సౌకర్యాల చర్యలను వేగవంతం చేయడానికి వనరులు సమీకరించడం ఎంతో కీలకమని మేయర్‌ పంతం రజనీ శేషసాయి పేర్కొన్నారు. ఇక్లి ఆధ్వర్యాన ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో జరిపిన చర్చల్లో ఆమె పాల్గొన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకోవాలని, ఆర్థిక ఇబ్బందులు లేని పద్ధతులను అవలంభించాలన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు మాట్లాడుతూ వాతావరణ పున: సృష్టిని మెరుగుపరచడానికి మంచి పట్టణ పరిపాలనా విధానం, ఫైనాన్స్‌, మౌలిక సదుపాయాలపై  స్థిరమైన వ్యూహాత్మక విధానాలను అవలంభించాల్సి ఉంటుందన్నారు. ఫైనాన్షియల్‌ మోడల్స్‌, రవాణాపరంగా ఎదురయ్యే సవాళ్ళు తదితర అంశాలపై నిపుణులు చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here