తప్పుల తడకగా ఓటర్ల జాబితా

0
217
ఇష్టానుసారంగా సరిహద్దుల మార్పు
నేతల ఒత్తిడితో అధికారుల అత్యుత్సాహం
జాబితా ఒకే వ్యక్తికి 13 చోట్ల స్థానం
రాజమహేంద్రవరం, మే 18: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుండటంతో ఆయా పరిధిలో అధికారులు మాత్రం ఓటర్ల జాబితాను సిద్దం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్లకు సంబంధించి కొన్నిచోట్ల సరిహద్దులు మార్చి ఫొటోలతో ఓటర్ల జాబితా సిద్దం చేశారు. వాటిని ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఓటర్ల జాబితాను పరిశీలించిన పాలకులు తలలు పట్టుకుంటున్నారు. డివిజన్‌ పరిధిలో లేని డోర్‌ నెంబర్లను జాబితాలో చేర్చడంతో పాటు ఒక ఓటర్‌నే ఒకే పేజీలో పదమూడు సార్లు, మరొక ఓటర్‌ను ఎనిమిది, ఇంకొక ఓటర్‌ను ఏడు సార్లు చేర్చడాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కరి పేరే పది సార్లు ఒకే పేజిలో చేర్చడంపై విస్మమయమొందుతున్నారు. ఉదాహరణకు స్థానిక 30వ డివిజన్‌ విషయానికొస్తే కరిమున్నీసా షేక్‌ అనే మహిళ పేరు ఒక పేజీలో పదమూడు సార్లు చేర్చారు.అలాగే కరిముల్లా షేక్‌ పేరును ఒకేవపేజిలో ఐదుసార్లు, వీణదేవి కొఠారి పేరును నాలుగు సార్లు చేర్చి గంధరగోళానికి తెరలేపారు. ఓటర్ల జాబితా రూపొందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పుకుని అనుకూల పరిస్థితులను చేజిక్కించుకునేందుకు కొంతమంది నాయకులు వారికి అవసరమైన సరిహద్దులను తమ డివిజన్ల పరిధిలోకి చేర్చుకున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. దీనిపై కొంతమంది పాలకులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here