తాళం వేసిన ఇళ్ళే లక్ష్యం

0
316

నగరంలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

రాజమహేంద్రవరం, జనవరి 22 : పలు చోరీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఒక నేరస్తుడిని స్థానిక బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక బొమ్మూరు పోలీసుస్టేషన్‌లో ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ వి.నాగరాజు మీడియాకు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కుమార్దనపేటకు చెందిన కొల్లి జగన్మోహనరావు అలియాస్‌ నాని గత నెల రోజుల్లో రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో మూడు చోరీల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. నిందితుడు గత నెల 24వ తేదీన స్థానిక రామకృష్ణ నగర్‌లో కాశీనాధుని వెంకట సుబ్బా రావు ఇంటి తాళం పగులగొట్టి సుమారు 2 కాసుల బంగారపు వస్తువులు, 90 తులాల వెండి వస్తువులను దొంగిలించుకునిపోవడంతో పాటు ఈనెల 8వ తేదీన సావిత్రి నగర్‌లో మట్టా శ్రీనుబాబు ఇంటి తాళం పగులగొట్టి 6 కాసుల బంగారపు నగలు, వెండి సామగ్రి అపహరించుకుపోయాడు. ఈ నెల 13వ తేదీన పట్టపగలు స్థానిక రాజేంద్రనగర్‌లో జరిగిన కేజిన్నర వెండి వస్తువుల దొంగతనం కేసులో కూడా ఇతడు నిందితుడని ఆయన తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక కెవిఆర్‌ స్వామిరోడ్డులో చోరీ సొత్తును విక్రయించేందుకు తిరుగుతుండగా బొమ్మూరు ఎస్‌ఐ జె భానుప్రసాద్‌కు వచ్చిన సమాచారం మేరకు డిఎస్పీ నాగరాజ్‌ ఆధ్వర్యంలో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరాలకు తానే పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here