తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఆదిత్య వాలంటీర్లకు అభినందన 

0
138
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  28 : ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల 22 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు తిరుమలలో జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంగా కాలేజిలో వాలంటీర్ల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు విచ్చేసిన ఆదిత్య డిగ్రీ కళాశాలల కో ఆర్డినేటర్‌ బి.ఇ.వి.ఎల్‌.నాయుడు బ్రహ్మోత్సవాలలో పాల్గొని వచ్చిన విద్యార్ధులను అభినందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలోనే కాకుండా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌ ఎస్‌.పి.గంగిరెడ్డి మాట్లాడుతూ  తమ విద్యార్ధినులు దాస సాహిత్య ప్రోజెక్ట్‌ తరపున హేమలత నేతృత్వంలో నెలరోజులపాటు కోలాటం నేర్చుకకకుని, బ్రహ్మోత్సవాలలో శ్రీవారి వాహన సేవలో కోలాటం నిర్వహించడమే కాకుండా, వివిధ దేవతామూర్తుల వేషధారణతో భక్తులను అలరించడం అభినందనీయమన్నారు. తమ వాలంటీర్లు తిరుమలలోనే కాకుండా గత 4 సంవత్సరాలుగా పుట్టపర్తి సత్యసాయి ఆరాధనోత్సవాలలో కూడా సేవలు అందిస్తున్నారన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ జి.వి.ఎస్‌.నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ వాలంటీర్లు దసరా సెలవులలో అన్నమయ్య పూలరథం కార్యక్రమంలోను దేవీచౌక్‌ నవరాత్రి ఉత్సవాలలో కూడా సేవలు అందించారన్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న విద్యార్ధినులకు వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ కె.సి.సాగర్‌, సి.ఫణికుమార్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ రమాదేవి, లెక్చరర్లు పాల్గొన్నారు.