తూర్పు బిఎస్‌ఎన్‌ఎల్‌  బంగారం

0
286
సేవల్లో అవార్డులు, ప్రశంసలు : జీఎం విఠల్‌ దుర్గాప్రసాద్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 1 :  ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం, నిర్వహణ, మార్కెటింగ్‌,సేల్స్‌ ఇలా అన్ని విభాగాల్లో ఎపి సర్కిల్‌ లో తూర్పు గోదావరి జిల్లా బిఎస్‌ఎన్‌ఎల్‌ అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ  జిల్లా జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.విఠల్‌ దుర్గాప్రసాద్‌ చెప్పారు. జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అవార్డులు, ఏప్రిషియేషన్‌ సరిఫికేట్స్‌ వచ్చాయని ఆయన వివరించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న నన్నయ సంచార భవన్‌లో ఈ ఉదయం డిజిఎంలు ఇఎల్‌ నారాయణ, విఎస్‌ఆర్‌ మూర్తి, విహెచ్‌ఆర్‌ఎల్‌ఎన్‌వి ప్రసాద్‌ తదితరులతో కల్సి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో పారదర్శకమైన బిల్లింగ్‌,అత్యుత్తమ టారిఫ్‌,విస్త త నెట్‌ వర్క్‌ కవరేజి,అతి తక్కువ చార్జితో ల్యాండ్‌ లైన్‌,బ్రాడ్‌ బ్యాండ్‌,మొబైల్‌,ఎంటర్‌ ప్రయిజ్‌ సొల్యూషన్స్‌ అందించే ఏకైక సంస్థ బిఎస్‌ ఎన్‌ ఎల్‌ అని చెప్పారు. జిల్లాలో 8లక్షల 71వేల416మొబైల్‌ కనెక్షన్స్‌,72వేల500ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్స్‌ ఉన్నాయని జీఎం  విఠల్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఇంట్లో మాట్లాడుకోడానికి మొబైల్‌ కన్నా, ల్యాండ్‌ లైన్‌ మంచిదని ఆయన చెబుతూ ఈ విషయంలో వినియోగదారుల్లో అవగాహన పెంచుతామన్నారు. మొబైల్‌ సర్వీసులకు సంబంధించి సెంట్రల్‌ ఆఫీస్‌ నుంచి అవార్డు అందుకున్నామని,అలాగే మెయింటినెన్స్‌ అవార్డు కూడా అందుకున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలో 2జి సెల్‌ టవర్స్‌  358, 3జి సెల్‌ టవర్స్‌ 208,ఏజన్సీలో 10 టవర్స్‌ పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. విస్తరణలో భాగంగా 2జి సెల్‌ టవర్స్‌ 18, 3జి సెల్‌ టవర్స్‌ 85 టవర్స్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 4జి సర్వీసును నగరంలో 25పోరాటాల్లో, కాకినాడలో 16ప్రాంతాల్లో అమలాపురంలో 4 ప్రాంతాల్లో త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 4జి యు సిమ్‌ లు అందుబాటులోకి రాగలవని ఆయన చెప్పారు. ఆకర్షణీయమైన అనేక ప్లాన్‌లు బిఎస్‌ఎన్‌ఎల్‌ అమలు చేస్తోందని ఇందులో 429రూపాయల ప్లాన్‌కి మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. 1099 రూపాయలకు వింగ్స్‌ ఆన్‌ లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైందని,అపరిమిత కాల్స్‌ దేశమంతటా ఏ నెట్‌ వర్క్‌ కైనా చేసుకోవచ్చని సిమ్‌ అవసరం లేకుండా వాడుకునే అవకాశం దీనివల్ల ఉంటుందని జీఎం విఠల్‌ దుర్గాప్రసాద్‌ చెప్పారు. అందరికన్నా ముందు 5జి సేవలను బిఎస్‌ఎన్‌ఎల్‌ అందుబాటులోకి తీసుకు వస్తుందని, అప్పుడు చాలా సమస్యలు తొలగిపోతాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here