తెదేపాకే మళ్ళీ పట్టం కట్టండి

0
122
12వ డివిజన్‌ నగరదర్శినిలో గన్ని, ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 26 :నిరంతరం ప్రజా సమస్యల కోసం పని చేస్తున్న తెదేపా ప్రభుత్వానికే ప్రజలు మళ్ళీ పట్టం కట్టాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ,  ఎంఎల్‌ సి ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 12వ డివిజన్‌లో ఈరోజు నగర దర్శిని – నగర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివ ద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబునాయుడునే ఎన్నుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో  పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, డివిజన్‌ అధ్యక్షులు కాశీ విశ్వనాథం, వెంపటాపు వాసు, కడియాల రాజశేఖర్‌, మహబూబ్‌ ఖాన్‌, మొల్లి చిన్ని యాదవ్‌, సంసాని ప్రసాద్‌, గుత్తుల వెంకట నారాయణ, తలారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here