తెదేపాతోనే ప్రజా సంక్షేమం సాధ్యం

0
364
కడియపులంకలో జనచైతన్య యాత్ర
రాజమహేంద్రవరం, నవంబర్‌ 29 : తెలుగుదేశం ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. తెదేపా జనచైతన్య యాత్రలో భాగంగా రూరల్‌ నియోజకవర్గంలోని కడియపులంకలో జరిగిన కార్యక్రమంలో గోరంట్లతో పాటు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, ఎంపిపి మార్గాని లక్ష్మీ, గంగుమళ్ళ సత్యనారాయణ, మార్గాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల, గన్ని మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.  పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన వా గ్ధానాలను అమలు చేస్తున్నారని, రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను చాలా వరకు మాఫీ చేశారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడి ్డ రాంబాబు, మార్ని వాసుదేవరావు, పాలపర్తి రోజా, కార్పొరేటర్లు కిలపర్తి శ్రీనివాస్‌, కోరుమిల్లి విజయ్‌శేఖర్‌ పాల్గొన్నారు.